వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండలం రామన్నపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన అండర్ 17 విద్యార్ధినులు మండల ఎస్ జీ ఎఫ్ అంతర్ జిల్లా పాఠశాలల క్రీడా టోర్నమెంట్ లో మండల రెండో బహుమతిని సాధించారు. ఇప్పటివరకు ఈ పాఠశాలకకు వ్యాయమ ఉపాధ్యాయులు లేనప్పటికి విద్యార్ధినులు వారి సొంత ప్రాక్టీస్, ఆడాలనే తపన వారిని ఈ టోర్నమెంట్ లో రన్నర్లన్ చేసిందని స్కూల్ హెడ్ మాస్టర్ శివాజీ తెలిపారు. పాఠశాలకు మండల పరిధి మంచి పేరు తెచ్చిన విద్యార్థునులను అభినందించారు.గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు వారిని అభినందించారు.