వెబ్ న్యూస్, బతుకమ్మ : బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్సహంతో ఓటు వేసేందుకు పోలింగ్ బూతుల వైపు ఓటర్లు బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 47.62 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.