Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2025, 4:49 pm Posted by : ramakrishna

14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు

 

. . .  158 సర్పంచ్ స్థానాలు … 1081 వార్డు సభ్యులు

. . . 1476 పోలింగ్ కేంద్రాలు… 2,38,838 మంది ఓటర్లు

 నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ డివిజన్ లోని ధర్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్పల్లి మండలాల్లో గల గ్రామాలలో ఈ నెల 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను 38 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో  158 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 568 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.1760 వార్డు స్థానాలకు గాను 5 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 674 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1081 వార్డు సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరుగనుంది. 2634 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం 1476 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా  2,38,838 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 1476 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్ లు, 1937 మంది ఓ పీవోలు నియమించారు. 53 రూట్ల ద్వారా  సిబ్బంది తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. 56 మంది  మైక్రో అబ్జర్వర్లు , 34  జోనల్ అధికారులు , 61 వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగిన  తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. ముందుగా వార్డు సభ్యులు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. తర్వాత సర్పంచ్ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.