Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 10:43 am Posted by : ramakrishna

హైదరాబాద్ లో  రెండో రోజు కొనసాగిన ఐటీ సోదాలు

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మెహిఫిల్, షా హౌస్ హోటల్స్, యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  మంగళవారం ఉదయం పలువురి ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో  ఐటీ రిటర్న్స్ లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వర్కర్ల నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.