ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు స్వచ్ఛత కార్యక్రమం

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు పరిశుభ్రత పచ్చదనం అనే కార్యక్రమాన్ని శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చంద్రకాంత్ మాట్లాడుతూ విద్యాసంస్థలు పరిశుభ్రంగా ఉండటం విద్యార్థుల ఆరోగ్యం, చదువుకు ఎంతో అవసరమని తెలిపారు. కళాశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు...