Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 4:57 pm Posted by : ramakrishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు స్వచ్ఛత కార్యక్రమం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండవ రోజు పరిశుభ్రత పచ్చదనం అనే కార్యక్రమాన్ని శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చంద్రకాంత్ మాట్లాడుతూ విద్యాసంస్థలు పరిశుభ్రంగా ఉండటం విద్యార్థుల ఆరోగ్యం, చదువుకు ఎంతో అవసరమని తెలిపారు. కళాశాల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ సమన్వయకర్త వి. శంకరయ్య, టీఎస్‌కేసీ సమన్వయకర్త శివకుమార్, ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ జి. రాణి, డాక్టర్ సిద్ధు రాజు, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ గోదావరి, కృష్ణ ప్రసాద్, స్వప్న, సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ దశరథ్ మైమూద్, రాజు తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Second day of cleanliness program as part of the Public Governance Progress Plan