వైభవంగా శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మేళన, రక్షాబంధనము, అఖండ దీపారాధన, గోపూజ, దేవతలకు కుంబాభిషేకము, మండపారాధన, కళ్యాణము, శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణము, హవనము, బలి పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పలువురు దంపద జంటలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ...