- తడోబా టైగర్ కోసం రెండో రోజు కొనసాగిన వెతుకులాట
- పులి జాడకోసం మూడు రేంజ్ ల అధికారుల గాలింపు
- యానిమల్ ట్రాకర్ తో పాటు డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు
నిజామాబాద్, బతుకమ్మ : మహరాష్ట్రలోని తడోబా – ఆఅదిలాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు నుంచి ఆడ పులికోసం మగ పులి అన్వేషణ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం రాజన్న సిరిసిల్లా జిల్లా మల్యాలలో ఒక ఆవును చంపి కనిపించకుండా పోయి, నిజామాబాద్ జిల్లాలో తూంపల్లి ఆటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైన పులి అంతలోనే సరిహద్దుల దాటి కామారెడ్డి జిల్లాలో ఆవుల మందపై దాడి చేసి అలజడి రేపింది. దానితో ప్రజలు బిక్కు బిక్కుమంటు గడుపుతుండగా రామారెడ్డి మండలంలో పులి ఆహారం కోసం వస్తే చంపడానికి విష ప్రయోగం చేసిన విషయం అటవీశాఖను కుదిపేస్తుంది. రెండు రోజులుగా కామారెడ్డి అధికారులు పులి ఆచూకి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్నలు కనుమరుగైన తరువాత మరోసారి అడవిలో ఫారెస్టు , పోలీస్ శాఖ బూట్ల చప్పుడు పులి అచూకి కోసం వేట మొదలు పెట్టారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అటవీ అధికారులకు ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన మగ పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రెండు దశాబ్ధాల తరువాత పులి సంచారం ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. ప్రధానంగా చిట్టడువులకు నెలవైన ఉమ్మడి జిల్లాలో పులులు ఏనాడో కనిపించకుండా పోయాయి. అందుకు అటవీ ప్రాంతం క్షీణించడం, పోడు వ్యవసాయం పేరిట జరిగిన వనం హవనం (చెట్ల నరికివేత) ప్రధాన కారణం. ఇటీవల రాజన్న సిరిసిల్లా జిల్లా మీదుగా సిరికొండ రేంజ్ పరిధిలోని తాటిపల్లి అడవిలో తొలిసారి పులి జాడ కనపడింది. ఆనాటి నుంచి తొలిసారి యానిమాల్ ట్రాకర్స్ ద్వార పులి సంచారం నిజమని ధ్రువీకరించారు. కాని ఆనాటి నుంచి నిజామాబాద్ జిల్లాలో ఆ పులి జాడలేదు. మూడు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండా శివారు అటవీ ప్రాంతంలో ఆవుల మందపై చిరుత దాడి చేసి రెండు ఆవులను చంపివేసింది. దానితో తాండా చుట్టు ప్రక్కల ప్రాంతలలో పశువుల కాపలాదారులు, వ్యవసాయ దారులు, కూలీలు భయందోళనకు గురయ్యారు. ఐతే పులీ దాడిలో ఆవులు కోల్పోయిన వ్యక్తి ఆవు కలేబరంపై మరో ఇద్దరి సహాయంతో పురుగుల మందు కొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దానితో పులి ఆచూకి కోసం అటవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
పోరుగు రాష్ట్రం నుంచి వచ్చిన పులి కోసం అటవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ఫర్ టైగర్ ఎస్12 ( పేరుతో) వెతుకులాట ప్రారంభించారు. విష ప్రయోగం జరిగిన ప్రాంతానికి రెడియల్ ఏరియా మూడు కిలో మీటర్ల పరిధిలో ఆచూకి కోసం రెండు జిల్లాల కామారెడ్డి, మాచారెడ్డి, ఇందల్వాయి అటవీ అధికారులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. వారికి తోడుగా యానిమల్ ట్రాకర్ టీంతో పాటు మూడు డ్రోన్ లను తెప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. సాధరణంగా పులి అటవీ ప్రాంతంలో దాదాపు రోజుకు 25 కిలో మీటర్ల వరకు ఆహార అన్వేషణ చేస్తుంది. ఐతే ఆడ తోడు కోసం పులి ఎంతవరకు ఐనా వేళుతుందని ఆ కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సోమవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలో మేకల మందపై అడవి జంతువు దాడి విషయం తెలిసి అటవీ అధికారులు పులి జాడకోసం అక్కడ వెతికిన అది చిరుత పనిగా తెలిసి మళ్లి సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు. పులి ఆచూకి కనుక్కోనే వరకు వెతుకులాట కొనసాగుతుందని అటవీ అధికారులు తెలిపారు.
