Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 6:29 pm Posted by : ramakrishna

సబ్ స్టేషన్లను సందర్శించిన ఎస్‌ఈ శ్రావణ్ కుమార్

బాన్సువాడ, బతుకమ్మ  : వినియోగదారులకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని కామారెడ్డి  ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం నస్రుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. సబ్ స్టేషన్ లో జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు సబ్ స్టేషన్లలో  విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట కామారెడ్డి డీఈ నాగరాజు, బాన్సువాడ డీఈ గంగాధర్, ఏఈ బాన్సువాడ అరవింద్ , సిబ్బంది ఉన్నారు.