. . . బోట్ల సహయంతో ఆరుగురి కోసం రిస్క్యూ ఆపరేషన్
. . . నదిలో చిక్కుకున్న గొర్రెల కోసం కొనసాగుతున్న ఆపరేషన్
బిచ్కుంద, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా బిచ్కుంధ మండలంలో మంజీరా నదిలో చిక్కుకున్న ఆరుగురిని ఎస్ డిఆర్ఎప్ టిం కాపాడింది. అదివారం సాయంత్రం మంజీరా నదిపరివాహక ప్రాంతమైన బిచ్కుంధ మండలం షెట్లూర్ లో నలుగురు గోర్రెల కాపరులు, ఇద్ధరు రైతులు ఆకస్మాత్తుగా వచ్చిన వరదలలో చిక్కుకున్నారు. అదివారం రాత్రి ఈ విషయం తెలిసిన తరువాత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదేశాల మేరకు తెల్లవారు జామునుంచి రిస్య్కూ ఆపరేషన్ చెపట్టారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి షెట్లూర్ గ్రామంలో జరుగుతున్న రిస్క్యూ ఆఫరేషన్ తో పాటు, సహయక చర్యలను పరిశీలించారు. గుండే కల్లూర్, షెట్లూర్ గ్రామాలకు చెందిన ఇద్ధరు రైతులు, నలుగురు గోర్రెల కాపరులను సోమవారం ఉధయం రెండు బోట్ల ద్వార రెస్క్యూటీం నదిలోకి వెళ్లి కాపాడారు. నిజాం సాగర్ ప్రాజెక్టు వరధ గెట్లు ఎత్తడం, మంజీర నదికి వరధ పెరుగడంతో సహయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. నదిలో చిక్కుకున్న 600 గోర్రెల కోసం రిస్క్యూ ఆపరేషన్ కోనసాగుతుంది.