Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 1:39 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ . . . బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట

 

. . . బోధన్ లో ఉద్రిక్తత

 

బోధన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ , బిఆర్ఎస్  నాయకుల మధ్య తోపులాట జరిగింది. సోమవారం బోధన్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా లో  అధికార, ప్రతి పక్షం పార్టీ నాయకులు ఒకేసారి నిరసనకు దిగడం తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. అదే సమయంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఎదురెదురుగా కూర్చొని నినాదాలు చేయడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Scuffle between Congress and BRS leaders
Scuffle between Congress and BRS leaders