బతుకమ్మ, నవీపేట్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్సీ 2008 ఉమ్మడి జిల్లా అభ్యర్థుల ధ్రువపత్రాలను శుక్రవారం ఉదయం 10 .30 గంటల నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరిశీలించారు. మొదటి రోజు వందకు పైగా ఉమ్మడి జిల్లా అభ్యర్థులు విల్లింగ్ లెటర్ తో పాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు, గెజిటెడ్ ఆఫీసర్ చే ధ్రువీకరించిన రెండు జిరాక్స్ సెట్ లను అధికారులకు అందించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. లేని ధ్రువపత్రాలను 4 వ తారీఖు లోపు అందించాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 2008 డిఎస్పీ సాధన సమితి నాయకులు శ్రీనివాస్ చావ్లా, కొక్కుల శ్రీనివాస్, సాయి రెడ్డి, హజారి జగన్నాథ్, తదితరులు పాల్గొన్నారు.