Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 1:00 pm Posted by : ramakrishna

ధర్పల్లిలో కలకలం రేపిన  కత్తెర పోట్లు 

ధర్పల్లి, బతుకమ్మ :  నిజామాబాద్  జిల్లా ధర్పల్లి  మండల కేంద్రంలో కత్తెర పోట్లు కలకలం రేపాయి. మంగళవారం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు అనే వ్యక్తి నలుగురిని దర్జీ కత్తెరతో పొడిచాడు .దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. మొదట కాలనీలో గల మచ్చ లక్ష్మీ ని కత్తెరతో పొడవగా ఆమె కూతురు గౌతమి అడ్డుపడటంతో  ఆమెను పొడిచాడు.   గొడవ జరుగుతుందని గమనించి పక్కింటి వ్యక్తులు వెళ్లగా వారిలో శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభను కూడా కత్తెరతో పొడిచాడు. అక్కడి నుంచి కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ అనే వ్యక్తిని  కత్తెరతో పొడిచాడు. గాయపడిన వారిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో  లక్ష్మి పరిస్థితి  విషమంగా ఉన్నట్లు తెలిసింది. మిగితా వారికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. ఈఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు  తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Scissor lifts cause chaos in Dharpalli