నీట మునిగిన వరి పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు

  కోటగిరి, బతుకమ్మ :   ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం కోటగిరి మండలంలోని సైలంపూర్ గ్రామ పరిధిలో, పోతంగల్ మండలంలోని తీర్మాల్లాపూర్ గ్రామ పరిధిలో శనివారం నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు. పొలంలో నిల్వ ఉన్న నీటిని వీలయినంత తొందరగా తీసి వేయాలని, పూర్తిగా కుళ్ళి పోయిన మొక్కలను గుర్తించి, మళ్ళీ నాటుకోవాలని రైతులకు సూచించారు. పసుపు రంగు లోకి ఆకులు మారినట్లు గమనించినట్లయితే 2% యూరియా లేదా 19.19.19 ను 5 గ్రాములు ఒక లీటరు...