- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్ ను ఇన్వెస్టిగేషన్ టూల్ గా మార్చుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటులో కార్యాలయంలో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ – 2025 కార్యాక్రమం (నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలు) పోలీస్ డిపార్ట్మెంట్ లో పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ పోటీలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమను తాము మెరుగుపరుచుకుని ఉత్తమ ప్రతిభ కనబరచడం కోసం తద్వారా కన్వెన్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎఆర్) రామ్ చందర్ రావ్, సి.సి.ఎస్. ఎ.సి.పి నాగవేంద్ర చారీ, జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్ , అదిలాబాద్ సి.ఐలు ఎ,ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.
