Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 7:35 pm Posted by : ramakrishna

నిత్యజీవనశైలిలో సైన్స్ చాలా ముఖ్యమైంది

  • జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిత్య జీవన శైలిలో సైన్సు చాలా ముఖ్యమైందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ విద్యార్థులకు తెలిపారు. విద్యార్థి దశ నుండి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే సైన్స్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని  వారు సూచించారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి  అశోక్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు, సైన్స్ లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్ర రామారావు, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, అర్బన్ సిడిపిఓ మరియుజిల్లా ఇన్చార్జి సంక్షేమ అధికారిని సౌందర్య, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత విజయానందరావు తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్య జీవితంలో ప్రతి నిమిషం గడవడం అంటే కేవలం సైన్స్ తో ముడిపడి ఉంటుందని వారు తెలిపారు.. విద్యార్థి దశ నుండి సైన్స్ పట్ల పరిశోధనలు చేసినప్పుడు వారి మెదడులో శాస్త్రీయ దృక్పథం అలవాడుతుందని చెప్పారు.. ఎప్పుడైతే శాస్త్రీయ దృక్పథం అనేది పిల్లల్లో అలవాటుతుందో వారికి తెలియకుండానే వారి మెదడు వారి దృష్టి ఎప్పుడు శాస్త్రీయ దృక్పథం వైపు అలాగే వారికి మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు.. ఈ మేధో శక్తి ద్వారా విద్యార్థుల నడవడిక అలాగే చదువుతోపాటు శాస్త్రీయ పరిజ్ఞానం అలాగే క్రీడల వైపు మళ్లుతుందన్నారు. పిల్లలు కూడా ఎలాంటి చెడు అలవాట్లవైపు మొగ్గుచూపి ఆస్కారం ఉండదని తెలియజేశారు. స్నేహ సొసైటీ అందుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ విద్యుత్ ప్రయోగం జల విద్యుత్ ప్రయోగం, మానవ శ్వాస వ్యవస్థ, ఇతర ప్రయోగాలు చూసి సంతోషం వ్యక్తం చేశారు.. ఇంతగా అంధ  మానసిక, దివ్యాంగ విద్యార్థుల్లో మేధో సంపత్తి పెంచే దిశగా స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

Science is very important in everyday life