శ్రీ వేద హైస్కూల్లో సైన్స్ విజ్ఞాన ప్రదర్శన
ప్రారంభించిన ఎంఈఓ శ్రీనివాస్ రావు కోటగిరి, బతుకమ్మ: విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయాలి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసికట్టుగా పనిచేయాలని కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో సైన్స్ విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అన్ని అంశాల పట్ల...