- ప్రారంభించిన ఎంఈఓ శ్రీనివాస్ రావు
కోటగిరి, బతుకమ్మ: విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయాలి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసికట్టుగా పనిచేయాలని కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో సైన్స్ విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలల సైతం పుస్తకాలలో చదువుతోపాటు ఇతర అంశాలపై విద్యార్థులలో అవగాహన పెంపొందించాలి అన్నారు. నేటి సమాజంలో చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తట్టుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అంటే చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక గణిత అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఈఓ పేర్కొన్నారు. చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంపొందిన రోజు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించగలుగుతారని ఆయన అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎంఈఓ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయులు రవీందర్, శ్రీ వేద హై స్కూల్ కరెస్పాండెంట్ తెల్ల అక్షర, డైరెక్టర్ తెల్ల రవికుమార్, ఉపాధ్యాయ బృందం రేష్మ, షామిలి, నఫీజ్, నిర్మల, సాయి పవన్, సాయినాథ్, భీమ్రావు, చంద్రకళ, హారతి, నందిని, మాధవి, రమ, సంధ్య, సంగీత, అనురాధ, సునీత, శిరీష, ప్రవళిక పాల్గొన్నారు.