యూనివర్సిటీ సైన్స్ కళాశాలకు తరలి వెళ్లిన సైన్స్ విభాగాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా (వర్చువల్) ప్రారంభించిన యూనివర్సిటీ నూతన సైన్స్ కళాశాలలోనికి సైన్స్ విభాగాలు నేడు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరి రావు రిజిస్ట్రార్ ఎం.యాదగిరి తో కలిసి గణపతి పూజ నిర్వహించి కళాశాలలోని అన్ని విభాగాలను పరీక్షించి విభాగాధిపతులకు సూచనలు చేశారు. విద్యార్థులను క్రమశిక్షణతో విద్య అభ్యసించి ఉన్నతులుగా ఎదిగి ఈ ప్రాంతానికి, వారి కుటుంబాలకు పేరు ప్రఖ్యాతలు తెస్తూ భావితరాలకు మార్గదర్శకంగా...