Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 7:43 pm Posted by : ramakrishna

యూనివర్సిటీ సైన్స్ కళాశాలకు తరలి వెళ్లిన సైన్స్ విభాగాలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా (వర్చువల్) ప్రారంభించిన యూనివర్సిటీ నూతన సైన్స్ కళాశాలలోనికి సైన్స్ విభాగాలు నేడు తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరి రావు రిజిస్ట్రార్ ఎం.యాదగిరి తో కలిసి గణపతి పూజ నిర్వహించి కళాశాలలోని అన్ని విభాగాలను పరీక్షించి విభాగాధిపతులకు సూచనలు చేశారు. విద్యార్థులను క్రమశిక్షణతో విద్య అభ్యసించి ఉన్నతులుగా ఎదిగి ఈ ప్రాంతానికి, వారి కుటుంబాలకు పేరు ప్రఖ్యాతలు తెస్తూ భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంపత్ కుమార్, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు, సైన్స్ విభాగాలతో పాటు అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Science departments that moved to the University Science College