Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 2:34 pm Posted by : ramakrishna

స్కూల్ విద్యార్థుల చేత రోడ్డు భద్రతపై ప్రమాణం

 నవీపేట్, బతుకమ్మ :

 

రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకోని రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా పాఠశాల విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. బుదవారం నవీపేట్ స్కాలర్స్ హైస్కూల్‌లో 1300 మంది విద్యార్థులు, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 1000 మంది విద్యార్థులు రోడ్డు భద్రతా కార్యక్రమంలో ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా డిటిఓ ఉమా మహేశ్వర్‌రావు , ఎంవిఐ కిరణ్ కుమార్, ఎఎంవీఐలు పవన్ కళ్యాణ్, వాసుకి, శృతి లు, నార్త్ రూరల్ సర్కిల్ సీఐ శ్రీనివాస్ , నవిపేట్ ఎస్ఐ శ్రీకాంత్ , ఎంఇఓ అశోక్ , ఈ-డీ ఏఆర్ వర్షలు రెండు పాఠశాలల విద్యార్థులకు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది లు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు పాఠశాల సిబ్బంది హెల్మెట్ పంపిణీ చేశారు.

School students take oath on road safety