Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 7:25 pm Posted by : ramakrishna

సైబర్ సెక్యూరిటీ అంబాసెడర్ తో స్కూల్ విద్యార్థులను చైతన్యం చేయాలి

  • అదనపు పోలీస్ కమీషనర్ బస్వారెడ్డి

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలందరికి సమర్ధవంతంగా సేవలందించడం లక్ష్యంగా  పొలీస్ శాఖ పని చేయడం జరుగుతుందని నిజామాబాద్ అధనపు పోలీస్ కమీషనర్ ( అడ్మీన్ ) గట్టు బస్వారెడ్డి అన్నారు. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధూశర్మ ఆదేశాను సారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని సైబర్ సెక్యూరిటీ అంబా సెడర్ లోభాగంగా “స్కూల్ విద్యార్థులను ” చైతన్యం కార్యక్రమం జరిగింది…. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) మాట్లాడుతూ …సాంకేతిక పద్దతులకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నా నేపధ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క అవశ్యకత చాలా ఉన్నదని తెలిపారు. ఇందు కోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కోన్నారు. సైబర్ క్రైమ్ నేరాలకు ఎవ్వరు ఆకర్షితులు కాకూడదని ఎవ్వరైనా సైబర్ నేరాల ఉచ్చులో పడ్డట్లయితే వారు 1930 ద్వారా కూడా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయ వచ్చని (లేదా) డయల్ 100 కు ఫోన్ చేయాలని (లేదా) సంబంధిత పోలీస్ స్టేషన్ ను సంప్రదించా లని కోరారు. ప్రధానంగా భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదుచేస్తే వాటిని తక్షణం నిలిపివేసి సంబంధిత వారి యొక్క ఖాతా ను ఫ్రీజు చేసే విధంగా చూడవచ్చని, సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్థులను గుర్తించడం జరుగుతుందని, వారికి శిక్షపడేలా చేయడం తద్వారా భాధితులకు న్యాయం చేయడం జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో విధ్యార్థులు ఏ మోసాలలో చిక్కకుండా వాటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఈ కార్యాక్రమంలో ప్రొబెషనరి ఐ.పి.యస్ సాయికిరణ్ పత్తిపాక, జిల్లా విధ్యా శాఖ అధికారి అశోక్, సైబర్ క్రైమ్ ఎ.సి.పి వై.వెంకటేశ్వర రావు, సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముఖీద్ పాషా, సైబర్ క్రైమ్ సిబ్బంది ,ప్రభుత్వ పాఠశాలల విధ్యార్ధులు ఉపాధ్యాయులు  పాల్గోన్నారు.

School students should be sensitized with cyber security ambassador