Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 2:05 pm Posted by : ramakrishna

11 ఏళ్ల తర్వాత పాఠశాల పునః ప్రారంభం

బతుకమ్మ బోధన్

బోధన్ మండలం భవానిపేట గ్రామంలో గత 11 ఏళ్లుగా మూసి ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సబ్ కలెక్టర్ బోధన్ వికాస్ మహాతో పునః ప్రారంభించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ పిల్లవాడికి ప్రాథమిక విద్య అందించాల్సిన అవసరాన్ని గుర్తించి, స్థానిక అధికారులు చొరవ చూపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరూ చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఉచిత విద్య, సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో బోధన్ ఎంఈవో, ఎంపీడీవో, భవానిపేట్గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

School reopens after 11 years