పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మెరుగుపడేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అన్ని మండలాల ఎంఈవోలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి పదవ తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు. పాఠశాలల్లో మంజూరయ్యే అభివృద్ధి, మరమ్మతు పనులకు సంబంధించిన పూర్తి...