Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 6:56 pm Posted by : ramakrishna

వన సంరక్షకున్ని అభినందించిన పాఠశాల బృందం

బతుకమ్మ,ఏర్గట్ల: ఉపాధి హామీ పథకంలో భాగంగా 500 మొక్కలను జడ్పీ హెచ్ ఎస్ తడపాకల్ పాఠశాల పరిసరాల ఆవరణలో  చెట్లను సంరక్షించుటకై  వన సేవక్ (చెట్ల సంరక్షకుడు) తడపాకల్ గ్రామానికి చెందిన బడిగిరి సాయన్న ను నియమించారు. సాయన్నకు చెట్లు అంటే ఎంతో ప్రేమ. ఆయన క్రమం తప్పకుండా రోజు మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళలో నీళ్లను పోస్తూ వాటి సంరక్షణలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు.వాటి సంరక్షణను కాపాడుతున్న బడిగిరి సాయన్నను పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రధానోపాధ్యాయులు జావిద్ అభినందించారు.