Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 12:31 pm Posted by : ramakrishna

స్కూల్ బస్సు ల చెకింగ్ షూరు

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

వేసవి సెలవులు పూర్తయిన తర్వాత విద్యాసంస్థలు సోమవారం పున: ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎండాకాలం విద్యాసంస్థలకు సెలవు కాలంలో స్కూల్ బస్సు, మినీ వ్యాన్ లు, ఆటోలకు ఫిట్ నేస్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ అర్హత కలిగిన డ్రైవర్లతో విద్యాసంస్థల బస్సులను రోడ్డేక్కించాలన్న రవాణా శాఖ నిబంధనలు ఉన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల వాహనాలను తనిఖీ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ లో రవాణా శాఖాధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు స్కూల్ బస్సులు రోడ్డెక్కితే రెండు గంటల ఆలస్యంగా రవాణా శాఖాధికారులు తనిఖీలు చెపట్టడం పై విమర్శలు వస్తున్నాయి. మొదటి రోజు రవాణా శాఖ యూనిట్ ల పరిధిలో ఎం వి ఐ లు విద్యాసంస్థల వాహనాలు తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఎన్ని ఫిట్ నెస్ లేని వాహనాలు సీజ్ చేశారు అనేది ఇంకా తెల్చలేదు.

School bus inspections begin