Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 11:35 am Posted by : ramakrishna

కారును  వెనకనుంచి ఢీకొన్న పాఠశాల బస్సు

 భిక్కనూరు, బతుకమ్మ :  కారును వెనుక నుంచి స్కూల్ బస్సు ఢీకొన్న ఘటన భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వన్నెల్ బీ  బాల్కొండ కృష్ణవేణి హై స్కూల్ పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లోని వండర్ లా సందర్శనకు బస్సులో బయలుదేరారు. ఈక్రమంలో  భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద  బస్సు బ్రేక్ ఫెయిలై ముందు ఉన్న కారును ఢీకొంది. దీంతో ముందు వెనుక బస్సుల మధ్య కారు ఇరుక్కుపోయింది. ఈఘటనలో కారు ధ్వంసమైంది. ఈప్రమాదంలో ఎవరికి అపాయం జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.  ఆ సమయంలో ఒక  బస్సులో  60 మంది, మరో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు.అదృష్టవత్తు ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్ కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.  సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని బస్సులను స్టేషన్ కు  తరలించారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపు  ట్రాఫిక్ అంతరాయం కలిగింది.


School bus hits car from behind