బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
మోర్తాడ్, బతుకమ్మ: బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ బడల్లో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు మోర్తాడ్ విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి అవగాహన కల్పించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని గ్రామసభ నిర్వహించి తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామంలోని అధికారులు,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, మధు నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, వడ్డెర కాలనీ పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, ఏఎన్ఎం వి డి సి చైర్మన్,...