పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేత

రుద్రూర్, బతుకమ్మ: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కెనరా బ్యాంకు వారు ప్రతి సంవత్సరం అందజేసే డా.అంబేద్కర్ విద్యా జ్యోతి స్కాలర్షిప్ లను శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఐదు గురు విద్యార్థినీలకు కెనరా బ్యాంక్ సిబ్బంది షిండే, సుధాకర్ లు స్కాలర్ షిప్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.