స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి
. . . టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ కామారెడ్డి, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు...