నూతన మద్యం దుకాణాల కేటాయింపుకు షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ మద్యం పాలసీని ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ముగియనున్న ఎ 4 మద్యం షాపుల కేటాయింపుకు గురువారం షెడ్యూల్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్సుల ఖరారు కోసం ఈనెల 26 (శుక్రవారం) నుంచి టెండర్ల స్వీకరణకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో రూ. 3 లక్షలకు ఒక టెండర్ ఫారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్...