కేసు నమోదు చేసిన పోలీసులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : శ్రీశైలం దేవస్థానంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేపాయి. పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. నకిలీ దర్శనం టికెట్లపై ఆలయ సీఈవో మధుసూదన్ రెడ్డి స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేసిన పోలీసులు ఈఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ టికెట్ల అమ్మకాలు, భక్తుల కొనుగోలుపై అధికారులు, పోలీసులు కూపీ లాగుతున్నారు.