నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. గత రెండు రోజులుగా నిర్మల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మెన్ తన మూడో రోజు పర్యటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు రోడ్డు భవనాల శాఖ గేస్ట్ హౌజ్ కు చెరుకుంటారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఎస్ సి, ఎస్టీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మద్యహ్నం 3 గంటలకు నిజామాబాద్ నుంచి హైద్రాబాద్ కు బయలుదేరి వెలుతారు.