ఎస్సీ వర్గీకరణ చేయాలి
జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎస్.కోటేశ్వరరావు నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని గురువారం వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా.షమీం అక్తర్ కు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎస్.కోటేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా 59 కులాలు సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ చేయాలన్నారు. ఈ ఫలాలు 59 కులాలకు అందినప్పుడే ఈ వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మండల...