Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 5:13 pm Posted by : ramakrishna

ఎస్సీ వర్గీకరణ చేయాలి

  • జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎస్.కోటేశ్వరరావు

నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని గురువారం వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా.షమీం అక్తర్ కు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎస్.కోటేశ్వరరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడారు.  ముఖ్యంగా 59 కులాలు సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే  వర్గీకరణ చేయాలన్నారు. ఈ ఫలాలు 59 కులాలకు అందినప్పుడే ఈ వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మండల కమిటీ సభ్యులు ఆశీర్వాదం, కే.సంజీవరావు, గుత్తి లింగన్న, కిష్టయ్య, నరసింహులు, గంగాధర్ పాల్గొన్నారు.