Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 7:45 pm Posted by : ramakrishna

ఎస్సీ రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలి

నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్లను 59 షెడ్యూల్ కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  సీనియర్ నాయకులు  రేణికుంట నాంపల్లి ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు. గత 75 ఏళ్ల నుంచి మాదిగలకు చదువుతున్న అన్యాయం గురించి కమిషన్ కు వివరించారు. ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా మాదిగ మాదిగ ఉపకులాలకు అలాగే మాల ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. 1994లో ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పటి నుండి మాదిగ హక్కుల కోసంమాదిగ ఉపకులాల హక్కుల కోసం నిరంతరం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. ఇందులో 2000 – 2004 మధ్యలో ఏబిసిడి వర్గీకరణ రావడం ద్వారా మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఎన్నో అవకాశాలు విద్యా ఉద్యోగ రంగాల్లో రావడం జరిగిందన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కే పోశెట్టి ఎస్ శ్రీనివాస్ మోతే సాయన్న కే గంగాధర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.