Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 11:47 am Posted by : ramakrishna

ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్

 

. . . 24 గంటల్లో చర్యలు తీసుకున్న కలెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

హాస్టల్ నుండి సన్న బియ్యంను తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ నాందేవ్ వాడ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ జీవన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్ కు చెందిన సన్న బియ్యం ఆదివారం ఆటోలో తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాందేవ్ వాడ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ జీవన్ ఎస్సీ స్టడీ సర్కిల్ హాస్టల్ కు ఇంచార్జ్ గా వ్య హరిస్తున్నారు. హాస్టల్ నుంచి రెండు క్వింటళ్ళ సన్నబియ్యం ను ఆటోలో బయటికు తరలిస్తుండగా పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే హాస్టల్ వార్డెన్ జీవన్ మరో నెల  రోజుల్లో పదవి విరమణ చేస్తుండడంతో ఉద్యోగ సంఘాలు సరేండర్ చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే కలెక్టర్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని 24 గంటల్లో వార్డెన్ జీవన్ ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ గా ఇలా త్రిపాఠి బాధ్యతలు తీసుకున్న తర్వాత వార్డెన్ ను సస్పెండ్ చేయడం మొదటిసారి.