Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 3:37 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన ఎస్సీ కో ఆపరేటీవ్ ఈడీ ఆనంద్

. వచ్చే నెలలో రిటైర్ అవ్వాల్సి ఉండగా కక్కుర్తి

. రూ.33 లక్షల బిల్లు మంజూరుకు రూ.1.33లక్షల లంచం డిమాండ్

హైదరాబాద్, బతుకమ్మ: నెల రోజుల్లో ఉద్యోగ విరమణ పొందాల్సిన తెలంగాణ ఎస్సీ కో ఆపరేటీవ్ డెవలప్  మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బి ఆనంద్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ.33 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు ఆయన ఓ వ్యక్తిని రూ.1.33లక్షల లంచం డిమాండ్ చేశాడు. బాధిత వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఆనంద్ కుమార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగోల్ లోని ఆనంద్ ఇంటితోపాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల రోజుల్లో రిటైర్ అవ్వాల్సిన సమయంలో ఆనంద్ కుమార్ ఏసీబీ చిక్కడం చర్చనీయాంశమైంది.