ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి 

 కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ బతుకమ్మ, మాచారెడ్డి: సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలవాలని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు  మంథని సామ్యెల్ మాదిగ డిమాండ్ చేశారు. మాచారెడ్డి చౌరస్తా నుండి వెంకటేశ్వరస్వామి టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించి, మండల అధ్యక్షులు బట్ట రమేష్ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి...