Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 7:02 pm Posted by : ramakrishna

ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి 

 కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ

బతుకమ్మ, మాచారెడ్డి: సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలవాలని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు  మంథని సామ్యెల్ మాదిగ డిమాండ్ చేశారు. మాచారెడ్డి చౌరస్తా నుండి వెంకటేశ్వరస్వామి టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించి, మండల అధ్యక్షులు బట్ట రమేష్ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం ఖాయమన్నారు.  దేశాన్ని అనేక ఏండ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించకుండా సామాజిక న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించి మాదిగ జాతి , ఉపకులాలపట్ల మోసాలకు పాల్పడిందని గుర్తు చేశారు. 1965 లోనే ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు అందడం లేదని, ఎస్సీ వర్గీకరణ చేయాలని లోకూర్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక  సమర్పిస్తే దాని చెత్తబుట్టలో పడేసి సామాజిక న్యాయాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని వివరించారు. మాదిగలు, ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే, పదేళ్ళు దేశంలో అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.  ఆగష్టు 1 న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలే చేసుకోవచ్చని తీర్పు ఇస్తే, ఆ తీర్పును కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలో ముందుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మళ్లీ మోసానికి తెరదీశారు.  వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలభర్తీ చేస్తున్నాడని,కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకువచ్చి సామాజిక న్యాయం పట్ల తన చిత్తశుద్దిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని, అందుకోసం ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అందులో భాగంగానే అన్ని మండలాల్లో నిర్మాణ సదస్సులు నిర్వహిస్తున్నామన్నామన్నారు.  ఈసమావేశంలో యువనాయకులు చుక్కా పురం నాగరాజు, మహిళా జిల్లా అద్యక్షురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ,బట్ట వెంకటరాములుమాదిగ,బానపురం లావణ్య, పోదర్ల రవి గడ్డం బాబు రామచద్రం జాన్ కాశీరం గున్ని విజయ్ సిరికొండ దేవరాజు,, రామస్వామి  రమేష్ , శ్రీకాంత్, నాగరాజు సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.