ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య కామారెడ్డి, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రూసేగం భూమయ్య డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ యాత్ర నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ వెంటనే...