Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 6:50 pm Posted by : ramakrishna

ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య

కామారెడ్డి, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే అమలు చేయాలని కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రూసేగం భూమయ్య డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ యాత్ర నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మొత్తం ప్రతి గ్రామం తిరుగుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని దళితులను ఐక్యం చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగ, మాదిగ ఉప కులాలు ఉద్యోగాలు సాధించుకుంటామని అన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గాలకు తెలిసే విధంగా ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

SC classification should be implemented immediately