- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గోనె సాయిలు మాదిగ
బతుకమ్మ: బిచ్కుంద : మందకృష్ణ మాదిగ సుదీర్ఘ కాలం మడమ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వలన మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గోనె సాయిలు మాదిగ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర ,ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ఎమ్మార్పీఎస్ , ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాని గోనె సురేష్ మాదిగ అధ్యక్షత వహించారు అలాగే మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గోనె సాయిలు మాదిగ మాట్లాడుతూ ” మంద కృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడం ద్వారా 70 ఏళ్ల మాదిగల కల నెరవేరిందని అన్నారు. డా.అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు అందిస్తే మంద కృష్ణ మాదిగ ఆ రిజర్వేషన్లను దళితుల్లోని అన్ని కులాలకు అందిస్తున్నారని అన్నారు. న్యాయమైన లక్ష్యం కోసం పోరాటం బలంగా చేస్తే ఏనాటికైనా విజయం వరిస్తుందని ఎమ్మార్పీఎస్ ఉద్యమం రుజువు చేస్తుందని కొనియాడారు. మాదిగ అమరుల త్యాగాలు ఉద్యమం లక్ష్యం వైపు సాగేలా నడిపించాయని ,అమరులకు జోహార్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన అన్ని పార్టీలకు , సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెత్రి హన్మాండ్లు, గడ్డం గంగారాం,గోనె యాదయ్య, గోనె గంగారాం,మారుతీ అంజయ్య, లక్ష్మిమాన్, వీరేషం, అశోక్, పిరయ్య,కుల పెద్దలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
