ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయం

దళితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పై మంగళవారం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇదని పేర్కొన్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత...