Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 2:03 pm Posted by : ramakrishna

రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సచివాలయంలో  ముగిసిన ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సమావేశం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని  సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది.  రేపు ఉదయం 11 గంటలకు మరోసారి ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ సమావేశం ఉంటుందని సమాచారం.  రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  జీవో  మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని వెల్లడించారు.