ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవోను సోమవారం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. ఏ గ్రూపుకు 1%, బీ గ్రూపుకు 9%, సీ గ్రూపుకు 5 % చొప్పున రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది.  సోమవారం నుంచి  ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది.