- సుర్బిర్యాల్ దళిత తాజా మాజీ సర్పంచ్ కు అండగా ఎంఆర్పీఎస్
- కుల వివక్షను పాటిస్తే తీవ్ర పరిణామాలు
- ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ
ఆర్మూర్, బతుకమ్మ : మాదిగ తాజా మాజీ సర్పంచ్ మీద దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలం, సుర్బిర్యాల్ గ్రామ సర్వసమాజ్ వారి చేత గత 6 నెలలుగా కుల వివక్షకు, కక్ష్య సాందింపుకు గురి అవుతున్న గ్రామ దళిత తాజా మాజీ సర్పంచ్ అయిన సట్ల సవిత. ఆమె భర్త సట్ల గణేష్, గ్రామ మాదిగ కుల సంఘాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ తాజా మాజీ గ్రామ సర్పంచ్ భర్త సాట్ల గణేష్ గారిని గత 6 నెలలుగా గ్రామ సర్వసమాజ్ వారు వేధిస్తూ ఈనెల 23 న వారికి ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ ఇంటి స్థలాలను జేసీబీ ద్వారా చదును చేశారని తెలిపారు. అలాగే వారి పక్కన ఉన్న మిగతా మాదిగ కులం వారి ఇంటి స్థలాలను కూడా కుల వివక్షతో చదును చేసి, ఆ సర్పంచ్ కుటుంబం కట్టుకున్న మడిగేల మీద కూడా అక్రమంగా సర్వసమాజ్ అని పేరు రాసారని తెలిపారు. వద్దు అని అడ్డం వెళ్లిన మాదిగ కులస్తులను జేసీబీ కింద వేసి తొక్కండి అని మాట్లాడిన వారి పైన పోలీసు యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ దళిత మాదిగ సర్పంచ్ కు మద్దతుగా నిలిచిన మాదిగ కులస్తులను బెదిరించిన సర్వసమాజ్ సభ్యుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు, అలాగే పిడి ఆక్ట్ కూడా పెట్టీ శిక్షించాలని అన్నారు. గ్రామానికి వచ్చిన అభివృద్ధి నిధులలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎదైనా అవకతవకలకు పాల్పడితే చట్టప్రకారం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలి కానీ చట్టన్ని చేతులోకి తీసుకొని మేము ఎదైనా చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇది ముమ్మాటికీ కుల వివక్షనే, కక్ష్య సాధింపు చర్యనే అని దీనికి పరిష్కార మార్గం అధికారులు చూపకపోతే మాదిగలు రోడ్డు మీదికి వచ్చి ఆత్మగౌరవ పోరాటానికి వెనకాడరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి నాగం ప్రదీప్ మాదిగ, ఎంఆర్పీఎస్ జక్రంపల్లి మండల అధ్యక్షులు వేల్పుల వరుణ్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు కనక శ్రీదీప్ మాదిగ, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
