Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 3:56 pm Posted by : ramakrishna

కలెక్టర్, సీపీలతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భేటీ

  • బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి పరామర్శ

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేట్టీ అయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డు కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఐ.డీ.ఓ.సీకి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన బాధిత సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణ సందర్భంగా కానిస్టేబుల్ హత్యకు గురి కావడం ఎంతో బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. చైర్మన్ వెంట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అభివృద్ధి శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు.

SC and ST Commission Chairman meets with Collector and CP

SC and ST Commission Chairman meets with Collector and CP