సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ : చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను విద్యార్థినీలు, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఆరేటి రాంప్రసాద్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల తోపాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు....