ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్ బతుకమ్మ:బిచ్కుంద : స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ అన్నారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా బిచ్కుంద ఏఎంసి కార్యాలయంలో ఆమెకు ఘననివాళి అర్పించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని గంగాధర్ తెలిపారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను...